టీవీకే పార్టీ చీఫ్, నటుడు దళపతి విజయ్(Thalapathy Vijay)పై భార్య సంగీత సంచలన ఆరోపణలు చేశారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఐదేళ్ల కిందటే మేము మానసికంగా విడిపోయామని అన్నారు. విజయ్‌కి సినీ నటితో సంబంధం ఉన్నమాట నిజమే అని కుండబద్దలు కొట్టారు. ఆ నటితో విజయ్.. విదేశాలకు, పార్టీలకు వెళ్తారని హాట్ కామెంట్స్ చేశారు. భార్య ఉండగా.. వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం ద్రోహం అని సంగీత(Vijay Wife Sangeetha) ఆవేదన చెందారు. ఇకపై నన్ను విజయ్ వైపు నుంచి ఎవరైనా ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే ఆ నటి పేరు బయటపెడతానని సంగీత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. విజయ్ భార్య సంగీత చెంగల్‌పట్టు కుటుంబ న్యాయస్థానంలో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేయడం తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివాహ జీవితం సజావుగా కొనసాగడం లేదని, వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయస్థానం ఈ పిటిషన్‌ను స్వీకరించగా.. ఏప్రిల్ 20వ తేదీన కోర్టుకు హాజరుకావాలని విజయ్‌కు నోటీసులు జారీ చేసింది. కాగా, విజయ్, సంగీత వివాహం 1999లో జరిగింది. సంగీత లండన్‌కు చెందిన తమిళ కుటుంబానికి చెందినవారు. విజయ్ నటుడిగా ఎదుగుతున్న సమయంలో ఆయన అభిమానిగా సంగీత పరిచయం అయ్యారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Tags
india