నీటి సంపులో పడి అనుమానాస్పదంగా రెండు నెలల చిన్నారి మృతి చెందింది.
బిజినేపల్లి: రెండు నెలల పసికందు నీటి సంపులో మృతి చెందింది. ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలం, పాలెం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలెం గ్రామంలో నాగయ్య కూతురు నీలమ్మ రెండు నెలల క్రితం ఓ పసికందుకు జన్మనిచ్చింది. ఉదయం నాలుగు గంటల సమయంలో పసికందు నీటి సంపులో పడి మృతి చెందింది. దీంతో కుటుంబీకులు చిన్నారి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా స్థానికులు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనపై పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు
Tags
mahabubangar