దారుణం.. బావను చంపేసిన బామ్మర్దులు..
హైదరాబాద్, ఫిబ్రవరి 14: నగరంలోని అత్తాపూర్‌లో అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్ దారుణ హత్యకు గురయ్యారు. సులేమాన్ నగర్‌లోని తన సొంత ఆఫీసులో అడ్వకేట్‌పై కత్తులతో దాడి చేశారు. ఖదీర్‌ను మొదటి భార్య తమ్ముళ్లు అతి కిరాతకంగా చంపేశారు. పలుమార్లు కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడిన ఖదీర్.. సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. దాడి జరిగిన వెంటనే నిందితులు పరారయ్యారు.అడ్వకేట్ ఖదీర్‌కు రెండు పెళ్లిళ్లు జరిగాయి. రెండో పెళ్లి చేసుకోవడంతో.. ఖదీర్ మొదటి భార్య ఇంటికి రావడం మానేశాడు. ఈ కోపంతో బావ ఖదీర్‌పై.. ఇద్దరు బామ్మర్దులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఖదీర్ ఆఫీస్‌లో ఉన్న సమయంలో అక్కడకు వచ్చిన వారు.. మొదట రాడ్‌తో దాడి చేశారు. తలపై బలంగా కొట్టడంతో మహహ్మద్ ఖదీర్ కుప్పకూలిపోయాడు. ఆపై కత్తులతో ఆరుసార్లు పొడిచారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు.. తక్షణమే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ ఆధారాల సేకరిస్తోంది. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. అడ్వకేట్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
Tags
Hyderabad