- 10 నుంచి 16 వరకు.. సంక్రాంతి సెలవులు
- కనుమ రోజు స్కూళ్లకు హాలిడే
- సవరణ ఉత్తర్వులు జారీ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్
సంక్రాంతి సెలవులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) 2026 సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి సెలవులను (Sankranti Holidays) ప్రకటించింది. జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ సెలవులు ప్రభుత్వ, ప్రైవేటు, వాణిజ్య పాఠశాలలకు వర్తిస్తాయని పేర్కొంది.
కనుమ రోజు సెలవు
జనవరి 16వ తేదీన కనుమ రోజును పురస్కరించుకుని ఐచ్ఛిక సెలవు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కనుమ రోజున రైతులు తమ పండుగను ప్రత్యేకంగా చేసుకుంటారు. కనుమ రోజున ఉత్సవాలు, పండుగ సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
17 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం
జనవరి 17వ తేదీ నుంచి అన్ని పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులను తమ ఇళ్లకు తీసుకురావడానికి తల్లిదండ్రులు ప్లాన్ చేసుకుంటున్నారు.