భూత్పూర్ మున్సిపాలిటీ జాతీయ రహదారిపై సోమవారం ఘోర ప్రమాదం తప్పింది.
భూత్పూరు: భూత్పూర్ మున్సిపాలిటీ జాతీయ రహదారిపై సోమవారం ఘోర ప్రమాదం తప్పింది. సీసీ ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలుకు చెందిన జయరాములు అనే వృద్ధుడు, తన భార్య, వ్యక్తిగత సహాయకులతో కలిసి హైదరాబాద్ నుండి కర్నూల్ వైపు తన కారులో బయలుదేరారు. భూత్పూర్ మున్సిపాలిటీ దాటగానే పోలీస్ స్టేషన్ సమీపంలో కారు లారీలను దాటుకుంటూ ముందు వెళుతున్న బొలెరో వాహనాన్ని తప్పించుకునే క్రమంలో డ్రైవర్ సడన్‌గా కుడి వైపుకు వాహనాన్న తిప్పాడు. ఆ వెనకే వేగంగా వస్తున్న టాంకర్, కారును ఢీకొట్టి దాదాపుగా 100 మీటర్లకు పైగా దూరం తోసుకువెళ్ళింది.
కారు బోల్తా పడకపోవడంతో తప్పిన పెను ప్రమాదం..
ఈ ప్రమాదం జరిగే సమయంలో కారులో ఉన్న జయ రాములు, అతని కుటుంబ సభ్యులు హాహాకారాలు చేశారు. ప్రమాద సమయంలో కారు బోల్తా పడకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదే సమయంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి హైదరాబాద్ నుండి వనపర్తిలో జరిగే కార్యక్రమాలకు హాజరు అవుతుండగా గుర్తించి తన కాన్వాయ్‌ని ఆపి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఉండిపోయిన వృద్ధుడు జయనారాయణ తదితరులను మంత్రి స్వయంగా బయటకు తీశారు. ఇంత ప్రమాదం జరిగిన ఎవ్వరికి ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరో వాహనంలో జయ నారాయణ కుటుంబ సభ్యులను పంపాలని ఎస్సై చంద్రశేఖర్ కు విజ్ఞప్తి చేశారు. మంత్రి వెంటనే స్పందించి తన మానవత్వాన్ని చాటుకోవడం పట్ల జయనారాయణ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Tags
mahabubnagar