కారును ఢీకొట్టిన బొలెరో వాహనం.. తల్లీకూతురు దుర్మరణం..
మూసాపేట: కారును ఢీకొట్టిన బొలెరో వాహనం.. తల్లీకూతురు దుర్మరణం.. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న బొలెరో వాహనం డివైడర్‌ను వేగంగా తాకి ఎదురుగా వస్తున్న కారుని ఢీ కొట్టిన సంఘటనలో తల్లీకూతురు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. మూసాపేట ఎస్సై వేణు తెలిపిన వివరాల ప్రకారం.. రాయలసీమలోని ఎమ్మిగనూరుకు చెందిన రాధ (32) , లక్ష్మీ దుర్గ (8) తమ కుటుంబ సభ్యులతో కలిసి తమ సొంత ఊరు నుండి హైదరాబాదుకు బయలుదేరారు. హైదరాబాద్ నుండి వేగంగా వెళ్తున్న బొలెరో వాహనం డివైడర్‌కు బలంగా తాకి.. ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ సంఘటనలో రాధా, లక్ష్మీ దుర్గ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వేణు తెలిపారు.