గద్వాల ఎమ్మెల్యే బీఆర్ఎస్‌లో ఉన్నారా? కాంగ్రెస్‌లో ఉన్నారా?- ఎంపీ డీకే అరుణ


 

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్‌లో ఉన్నాడా, లేక కాంగ్రెస్ పార్టీలో ఉన్నడా ఇందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జవాబు చెప్పాలని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ ఒక ప్రకటనలో సూటిగా ప్రశ్నించారు.

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మారలేదని, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెపుతున్నారని, మరి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాలలో కాంగ్రెస్ జెండా పట్టుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండని ప్రచారం చేస్తున్నాడని, ఇంతకీ ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్‌లో ఉన్నాడా, లేక కాంగ్రెస్ పార్టీలో ఉన్నడా ఇందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జవాబు చెప్పాలని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ ఒక ప్రకటనలో సూటిగా ప్రశ్నించారు. స్పీకర్ కూడా కోర్టులను మోసం చేస్తున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంతకన్నా దారుణం ఇంకా ఏముంటుందని ఆమె తీవ్రంగా విమర్శించారు.
ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఏదో ఒకటి తెరపైకి తేవడం అలవాటుగా మారిందని, ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని ఫోన్ ట్యాపింగ్ తెరపైకి తెచ్చారని, ఈ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడం ఎన్నికల స్టంట్‌గా ఆమె అభివర్ణించారు. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యలో ఉన్న అండర్ స్టాండింగ్ పాలిటిక్స్ అని, ఎన్నికలయిపోయాక ఏవీ ఉండవని, ఇవన్నీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఆమె తెలిపారు. కాళేశ్వరం, ఈ-కార్ రేస్ నివేదికలు వచ్చాయని, ఈ రెండేళ్లలో ఏం చర్యలు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే శంకుస్థాపనలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని ఆమె విమర్శించారు. మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వంతోనే సాధ్యమని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకే ఓటు వేసి, మహబూబ్ నగర్ మేయర్ స్థానాన్ని బీజేపీ కి అవకాశం ఇవ్వాలని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow