ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయన విజ్ఞప్తిని సిట్ అధికారులు తిరస్కరించారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కాకుండా హైదరాబాద్‌లోనే విచారించాలని నిర్ణయించారు. దీనిపై మరికాసేపట్లో కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వనున్నారు. నిన్న( గురువారం) సిట్ అధికారులు కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు వెళ్లి నోటీసులు అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని నోటీసులో స్పష్టం చేశారు.
Tags
BRS
