మండల పరిధిలోని గోకారం గ్రామంలో ఓ కుటుంబానికి సంబంధించిన బంధువుల మధ్య గొడవ జరిగి వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకుంది.
చారకొండ : మండల పరిధిలోని గోకారం గ్రామంలో ఓ కుటుంబానికి సంబంధించిన బంధువుల మధ్య గొడవ జరిగి వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. చారకొండ ఎస్సై పి. వీరాబాబు తెలిపిన వివరాల ప్రకారం.. గోకారం గ్రామానికి చెందిన చిత్తారి యాదగిరి భార్య అలివేల 9 నెలల గర్భవతి. ప్రసవం కోసం 5 నెలల క్రితమే తల్లి గారి ఇంటికి వెళ్లిందని, ఈ నెల 18 న యాదగిరి అత్త రత్నమ్మ తన కూతురు మీ ఇంటికి కాపురానికి రావాలంటే మీ అక్క చెల్లెలు ఉండొద్దని పదే పదే మా ఇంటికి వచ్చి దూషిస్తున్నారని గొడవ చేస్తుండడంతో భార్య భర్తల కాపురం గురించి 19న పెద్ద మనసుల సమక్షంలో పంచాయతీ ఏర్పాటు చేశారు. భార్య తరఫున బంధువులు పంచాయతీకి రాకపోవడంతో మమ్మల్ని పంచాయతీకి లాగుతారా అని ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగి, మాట మాట పెరిగింది. రత్నమ్మ తమ్ముడు చిత్తారి మహేష్, చిత్తారి శేఖర్, కప్పేర బన్నీలు భర్త యాదగిరిపై గొడ్డలితో దాడికి ప్రయత్నించారు. గొడవ చేసుకోవద్దని అడ్డం వచ్చినా యాదగిరి సోదరుడు వినోద్ పై గొడ్డలితో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి లో చిత్తారి మాయమ్మ, కొండపల్లి మంజుల, పద్మ లు పాల్గొన్నట్లు ఎస్సై పేర్కొన్నారు. బాధితుడు ప్రస్తుతం కల్వకుర్తిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఫిర్యాదుదారుడు యాదగిరి నుంచి వివరాలు సేకరించామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని ఎస్సై వీరబాబు వెల్లడించారు.
Tags
Telagana