బైపాస్ రోడ్డులో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి : ఎస్పీ జానకి


 

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డులో ప్రమాదాల నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్పీ జానకి ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డులో ప్రమాదాల నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్పీ జానకి ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో రోడ్డు భద్రత పై రూపొందించిన గోడ ప్రతులను ఎస్పీ ఆవిష్కరించి, అనంతరం బైపాస్ రోడ్డులో ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను సందర్శించి పలు సూచనలు చేశారు. పలుచోట్ల డివైడర్లను పగులగొట్టి రాంగ్ రూట్లో ప్రయాణించడాన్ని ఆమె గమనించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అటు, ఇటు ఎదురెదురుగా, రాంగ్ రూట్లో ప్రయాణించడం వలన 'ఢీ' కొని ప్రమాదాలు చోటు చేసుకొని, ప్రాణాలకు ముప్పుగా మారుతుండడం గుర్తించామని ఆమె తెలిపారు. డివైడర్లను పగులగొట్టిన చోట వెంటనే మూసివేసి అక్కడ బలమైన డివైడర్ లను నిర్మించాలని మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ని ఆదేశించారు. డివైడర్లు పగులగొట్టి తప్పు మార్గాల్లో వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమని, ప్రమాదాలు జరిగి తమ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను కూడా ప్రమాదాల్లోకి పడేస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. రోడ్డు భద్రత మాసోత్సవ సందర్భంగా అందరూ అవగాహనతో మెలిగి ప్రమాదాలను నివారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ లు ఎన్బీ రత్నం, సురేష్ కుమార్, డిఎస్పీ లు వెంకటేశ్వర్లు, గిరిబాబు, వన్ టౌన్ సీఐ అప్పయ్య,టూ టౌన్ సీఐ ఇజాజొద్ధీన్, రూరల్ సిఐ గాంధీనాయక్, సీసీ రాంరెడ్డి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow