హైదరాబాద్‌లో దారుణం.. చున్నీతో భర్తను చంపిన భార్య..


 హైదరాబాద్, జనవరి 20: కూకట్‌పల్లిలోని ఈనాడు కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా చంపేసింది ఓ భార్య. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ, పోలీసుల విచారణలో అసలు గుట్టు వీడింది. భర్తను చంపిన భార్యను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సుధీర్ రెడ్డి (44), ప్రసన్న భార్యాభర్తలు. కూకట్‌పల్లిలోని ఈనాడు కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓసారి సుధీర్ రెడ్డిని చంపేందుకు ప్రసన్న ప్రయత్నించింది. ఆ పన్నాగాన్ని పసిగట్టిన సుధీర్ రెడ్డి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య తనను చంపేందుకు ప్రయత్నిస్తోందంటూ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ తరువాత అంతా సద్దుమణిగిందని భావించగా.. సరిగ్గా వారం తరువాత తన ప్లాన్‌ను అమలు చేసింది ప్రసన్న. గత నెల 24వ తేదీన సుధీర్ రెడ్డి మెడకు చున్నీ బిగించి చంపేసింది. ఆ తర్వాత తనకేమీ తెలియదన్నట్లు డ్రామాలాడింది. సుధీర్ రెడ్డి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా సుధీర్ రెడ్డిని హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు.. మృతుడి భార్య ప్రసన్నను విచారించారు. ఈ విచారణలో తానే హత్య చేసినట్లు అంగీకరించింది. అక్రమ సంబంధానికి, జల్సాలకు అడ్డుగా ఉన్నాడనే కారణంగానే సుధీర్ రెడ్డిని చంపేసినట్లు చెప్పింది. ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow