మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ అయింది. బారామతిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న సమయంలో విమానం కూలిపోగా.. వెంటనే భారీ మంటలు చెలరేగి కాలి బూడిదయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ సహా ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు జాతీయ మీడియా పేర్కొంది. గాయపడిన వారందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. స్పాట్ లో కొందరు మృతి చెందిన ఆనవాళ్లు కనిపించాయని వాళ్లెవరన్నది తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం స్పాట్ లో సహాయక చర్యలు జరుగుతున్నాయి. పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని మంటల్ని అదుపుచేస్తున్నారు. బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నించిన క్రమంలో క్రాష్ అయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags
india