గురుకుల ఎంట్రెన్స్ గడువు పెంపు..ఈ నెల 25 వరకు పొడిగిస్తూ నిర్ణయం


 బీసీ, ఎస్సీ, ఎస్టీ సొసైటీ గురుకులాల్లో వచ్చే ఏడాది సీట్ల భర్తీకి ఇచ్చిన టీజీ సెట్–2026 గడువును ఈ నెల 25 వరకు పొడిగిస్తున్నట్టు సెట్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సెక్రటరీ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. బుధవారంతో ముగుస్తున్న గడువును పొడిగించాలని తల్లిదండ్రులు, స్టూడెంట్ల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పత్రిక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు లక్షన్నర అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సవరణలు చేసుకునేందుకు బుధవారం నుంచి ఈ నెల 25 సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంచామన్నారు. 

ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు సీట్లను ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా భర్తీ చేయనున్నారు. గురుకుల ఎంట్రెన్స్ కు అప్లై చేసుకోవాలని కోరుతూ టీచర్లు రాష్ట్రంలోని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో అప్లైకి గడువు ముగుస్తుండగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను సెక్రటరీ ఆదేశించారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow