హైదరాబాద్: సూరారం(Suraram) పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల బాలుడిపై ఓ వీధి కుక్క(stray dog) దాడి చేసింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ దాడి ఘటనా సంబంధిత దృశ్యాలు సమీపంలోని సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియోలో.. బాలుడు నడుచుకుంటూ వస్తుండగా.. అటుగా వచ్చిన ఓ శునకం అకస్మాత్తుగా దాడి చేసింది. భయంతో ఆ బాలుడు బిగ్గరగా కేకలు వేయగా.. స్థానికులు అక్కడకు చేరుకుని ఆ కుక్కను తరిమికొట్టారు. అప్పటికే బాలుడి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.
Tags
Hyderabad
