Telangana Panchayat Elections: అన్నా... జర తప్పుకోరాదే..!

 పంచాయతీ పోరులో బుజ్జగింపులు 

పోటీ తీవ్రతను తగ్గించేందుకు అభ్యర్థుల యత్నాలు

  • అన్నా! ఇవి చేతులు కాదు.. కాళ్లనుకో!! ఈ ఒక్కసారీ నాకు సర్పంచి అయ్యే అవకాశమివ్వు. నువ్వొక్కడివి తప్పుకొంటే చాలు. మంచి మెజారిటీతో గెలుస్తా. మిగతావారు నాకు పోటీయే కాదు.
  • పెద్దపల్లి జిల్లాలో ఐదుగురు బరిలో ఉన్న గ్రామపంచాయతీలో ఓ పోటీదారు అభ్యర్థన 
  • అరే తమ్మీ..! మన పార్టీ మద్దతుదారులైన మీరిద్దరూ పోటీలో ఉంటే ఓట్లు చీలిపోతాయి. మీ ఇద్దరూ నష్టపోతారు. ప్రత్యర్థే లాభపడతాడు. నువ్వే పెద్ద మనసు చేసుకుని నామినేషన్‌ ఉపసంహరించుకో! 
  • మెదక్‌ జిల్లాలో ఓ అభ్యర్థికి భారత రాష్ట్ర సమితి ముఖ్య నేత సూచన 
  • మీ ఇద్దరూ నాకిష్టమే. కానీ, ఎదుటి పార్టీ మద్దతిస్తున్న వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉన్నాడు. ఆయన్ని తట్టుకోవడం నీవల్ల కాదు. ఈసారికి మనోడికే మద్దతివ్వు. కచ్చితంగా  గెలుస్తాడు. వచ్చే ఎంపీటీసీ  ఎలక్షన్లప్పుడు నీకు సహకరిస్తడు. 

  • నేడు, రేపు ఉపసంహరణలకు అవకాశం

    మొదటి విడత నామినేషన్ల దాఖలు ప్రక్రియ నవంబరు 29తో ముగిసింది. ఉపసంహరణకు మంగళ, బుధవారాల్లో అవకాశం ఉంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోపు వైదొలగవచ్చు. దీంతో ఒకే పార్టీ మద్దతుతో నామినేషన్లు వేసినవారిలో చాలామంది ఒకరినొకరు బతిమాలుకుంటున్నారు. స్వతంత్రంగా పోటీలో ఉండాలనుకుంటున్న వారిని తప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎక్కువ ఓట్లున్న వర్గానికి చెందిన అభ్యర్థి పోటీలో ఉండేలా చూస్తున్నారు. ప్రత్యేకంగా బుజ్జగింపుల కోసం కొందరు నాయకులకు మూడు ప్రధాన పార్టీల ముఖ్య నేతలు బాధ్యతలు అప్పగిస్తున్నారు. 

  • బంధువులు, సన్నిహితులతో చెప్పిస్తూ... 

    నామినేషన్లు వేశాక కొందరు ఫోన్లు స్విచ్చాఫ్‌ చేశారు. బరిలో నుంచి తప్పుకొనేలా వారిని ఒప్పించేందుకు వారెక్కడున్నారో ఎలాగోలా తెలుసుకుని రహస్యంగా కలుస్తున్నారు. వారి బంధువులు, సన్నిహితుల ద్వారా కూడా పోటీలో ఉండవద్దని చెప్పిస్తున్నారు. ప్రతి ఓటూ కీలకమైందని భావిస్తుండటంతో వీలైనంత వరకు ఎక్కువ మంది పోటీలో ఉండకుండా చూడాలని ప్రధాన పార్టీల మద్దతుదారులు భావిస్తున్నారు. ఇందుకు కొందరు పంచాయతీ స్థాయి, నామినేషన్‌ వేసినవారి పలుకుబడిని బట్టి రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఇస్తూ పోటీ నుంచి విరమించేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు.  

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow