మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం నెలబండ తండాలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం బైరంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా 92 ఓట్ల మెజార్టీతో బి.స్వాతి (కాంగ్రెస్ )గెలుపు
మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. బుధవారం (డిసెంబర్ 17) మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా.. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదట బ్యాలెట్ ఓట్లు లెక్కించిన అధికారులు.. ఆ తర్వాత వార్డు మెంబర్ల ఓట్లు, సర్పంచి ఓట్లను లెక్కించి.. వెంటనే ఫలితాలను ప్రకటిస్తున్నారు. మూడో ఫేజ్ లో కూడా అధికార పార్టీ హస్తం హవా కొనసాగుతోంది. మెజారిటీ గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు.
గెలిచిన సర్చంచ్ అభ్యర్థులు వీరే..
మహబూబాద్ జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది.. ఈ జిల్లాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు 14 గ్రామపంచాతీల్లో గెలుపుపొందారు.
మహబూబాద్ జిల్లాలో ..
కాంగ్రెస్ 14
బీజేపీ -00
బీఆర్ ఎస్-01
ఇతరులు : 2
ములుగు జిల్లా
బీఆర్ ఎస్ -01
కాంగ్రెస్ -01
బీజేపీ -00
వరంగల్ జిల్లా
కాంగ్రెస్ -07
బీఆర్ ఎస్ -01
బీజేపీ -00
ఇతరులు-00
జనగామ జిల్లా
కాంగ్రెస్ -02
బీఆర్ ఎస్-02
బీజేపీ-00
ఇతరులు -00
భూపాలపల్లి జిల్లా
కాంగ్రెస్ -02
బీఆర్ ఎస్-01
బీజేపీ -00
ఇతరులు -02
నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని సౌనా గ్రామపంచాయతీలో ఇండిపెండెట్ అభ్యర్థి కేంశెట్టి నందా బాయి 42 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.