Fire Incident: సోమాజిగూడలోని క్షత్రియ హోటల్ సమీపంలో ఉన్న.. ఆల్ పైన్ హైట్స్ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్మెంట్ అయిదవ అంతస్తులో అకస్మాత్తుగా సిలిండర్ పేలడంతో భారీ మంటలు వ్యాపించాయి. దీంతో అపార్ట్మెంట్ వాసులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదం వల్ల అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్కు భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. గ్యాస్ సిలిండర్ లీకేజీ వల్లే పేలుడు సంభవించి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటన సమయంలో అపార్ట్మెంట్లో ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు తెలిపారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బంది తక్షణ చర్యల వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.
Tags
Hyderabad