గంజాయి విక్రాయాలకు అడ్డగా పోలేపల్లి సెజ్




మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో గురువారం ఉదయం జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి సుధాకర్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. జడ్చర్ల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామంలో తనిఖీలు నిర్వహించగా అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న బిజేష్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి ఎక్సైజ్ పోలీస్ లు అతని నుండి 1. 1కేజీల గంజాయిని, ఒక మోబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు బీహార్ రాష్ట్రానికి చెందిన బిజేష్ కుమార్ పోలేపల్లిలో గల సుప్రీం ఇండస్ట్రీస్ లిమిటెడ్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. బీహార్ రాష్ట్రం నుండి గంజాయినీ తీసుకొని వచ్చి 05 గ్రాములకు 400 చొప్పున, ఫోన్పే చెల్లింపుల ద్వారా వారికి గంజాయిని అందజేస్తేసున్నట్లు విచారణలో తెలిసింది. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నాము. జడ్చర్ల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎవరైనా గంజాయి క్రయ, విక్రయాలు జరిపినట్లయితే 9030019943 నెంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించగలరు అని ఆయన అన్నారు. ఎవరైనా గంజాయి విక్రయించినా, లేదా కొనుగోలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంద ఈ తనిఖీల్లో ci విప్లవ్ రెడ్డి స్టేషన్ si లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో గంజాయి క్రయ విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని, జడ్చర్ల పరిధిలో ఇప్పటి వరకు 12 కేసులను నమోదు చేసి 6.4 కేజీల గంజాయిని సీజ్ చేశామని తెలిపారు.



Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow