మిడ్జిల్: తల్లిదండ్రులు పతంగి ఇప్పించలేదని బాలుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని చిల్వేర్ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు స్థానిక వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జక్కా రాజు శ్రీలత దంపతుల కుమారుడు సిద్దు(9) ఇంటి స్లాబ్‌కు ఉన్న ఐరన్‌కు చీరతో ఉరి వేసుకొని మృతి చెందినట్లు తెలిపారు. ఇంట్లోనే ఉన్న కుటుంబ సభ్యులు కాపాడే ప్రయత్నం చేసిన అప్పటికే మృతి చెందాడు. మృతి చెందిన బాలుడు గ్రామంలో రెండవ తరగతి చదువుతున్నాడు. తొందరపాటులో తల్లిదండ్రులను భయపెడుదామని చూసి చివరికి మృత్యువాత పడ్డాడు. ఉన్న ఒక్క కొడుకు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ నాగరాజు , స్థానిక నాయకులు బాలుడి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Tags
Jadcherla