న్యూ ఇయ‌ర్ వేడుక‌లు ప్ర‌శాంతంగా జ‌రుపుకోవాలి : సీఐ క‌మ‌లాక‌ర్


 

జడ్చర్ల : జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని లోని వివిధ ప్రాంతాలలో న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఇతరులకు ఇబ్బందులు కలగకుండా 2025 ముగింపు పలికి 2026 స్వాగతం పలకాలని జడ్చర్ల కమలాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.

జడ్చర్ల : జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని లోని వివిధ ప్రాంతాలలో న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఇతరులకు ఇబ్బందులు కలగకుండా 2025 ముగింపు పలికి 2026 స్వాగతం పలకాలని జడ్చర్ల కమలాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంగళవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన న్యూ ఇయర్ వేడుకల గురించి సూచనలను సలహాలను అందజేశారు. జడ్చర్ల సర్కిల్లో 31 డిసెంబర్ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని మద్యం సేవించి పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మద్యం సేవించి రోడ్లపై ప్రమాదాల గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకొని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వారి వారి కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా అనేక పర్యాయాలు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఎంతోమంది మృతి చెందారని అలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుపుకొని సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు .
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow