హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు


 అలంపూర్ టౌన్ : తండ్రిని చంపిన కేసులో కూతురి సాక్ష్యంతో తల్లికి యావజీవ కారాగార శిక్ష పడింది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ కు చెందిన కృష్ణవేణి అలియాస్ హరిత అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడు అని ప్రియుడు తో కలిసి భర్తను చంపిన కేసులో ఐదుగురు నిందితులకు జీవిత ఖైదు తో పాటు ఒక్కొక్కరికీ 5000/- రూపాయాల జరిమానా విధిస్తూ మంగళవారం ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి ఎన్. ప్రేమలత తీర్పును వెల్లడించారు. 




సుమారు ఆరేళ్ల కిందట అలంపూర్ కు చెందిన హరిత లింగన్వాయ్ గ్రామానికి చెందిన మహేష్ తో అక్రమ సంబంధం కొనసాగిస్తూ ఉండటాన్ని భర్త షాలు కు తెలిసి హరితను మందలించాడు. దీంతో అక్రమ సంబంధానికి అడ్డుస్తున్నాడని ప్రియుడు తో కలిసి హత్య చేయాలని హరిత భావించింది. ఇదే అదనుగా పిల్లలతో కలిసి భర్తను నమ్మించి ఆరోగ్యం బాగోలేదని కర్నూలుకు తీసుకువెళ్లింది. తిరుగు ప్రయాణంలో ప్రియుడుతో కొంతమంది నిందితులతో కలిసి అలంపూర్ సమీపంలోని ఇమాంపూర్ దగ్గర రాత్రి పిల్లల ఎదురుగానే హత్య చేయించింది. మృతుడు షాలు సోదరుడు గోపి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో భార్య ప్రియుడుతో కలిసి హత్య చేశారని పోలీసులు నిర్ధారించి వారిని రిమాండ్ కి త‌ర‌లించారు. ఈ కేసు కు సంబంధించి మంగళవారం జిల్లా జడ్జి ప్రేమమలత ఐదుగురు నిందితులకు జీవిత ఖైదు, అయిదు వేల జరిమానా విధించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. నిందితులకు శిక్ష పడడంలో కూతురు సాక్ష్యమే కీలకంగా మారింది. కూతురు ధైర్యంగా కోర్టులో సాక్ష్యం చెప్పడంతో తల్లికి జీవిత ఖైదు శిక్ష పడింది. ఈ సందర్బంగా కోర్టులో నిందితులకు తగిన శిక్ష పడేలా సాక్షులకు తగిన బ్రీఫింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసిన డిస్ట్రిక్ట్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినోదాచారి, అదనపు ఎస్పీ కె.శంకర్, డి.ఎస్పీ మొగిలయ్య, అలంపూర్ సీఐ రవిబాబు, అలంపూర్ ఎస్సై వెంకటస్వామి, కోర్టు లైసెన్ ఆఫీసర్స్ ఎస్సై జిక్కి బాబు, ఏఎస్ఐ ప్రసాద్, సీడీఓ మాభాష పీసీ711 అధికారులను ఎస్పీ టి. శ్రీనివాస రావు అభినందించారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow