జోగులాంబ ప్రతినిధి : “యూరియా బస్తా… అది రైతు చెమటకి వచ్చిన నమ్మకం, పంటకి ఇచ్చే ప్రాణం. ఆ ప్రాణం కోసం మరి ప్రభుత్వాలు ఎన్ని క్యూలు, ఎన్ని యాప్‌లు, ఎన్ని వాగ్దానాలు ? చేస్తున్న రైతులకు మాత్రం కావాల్సిన యూరియా బస్తాలు దొరకడం లేదు. రైతు సోదరులు ఎదుర్కొంటున్న యూరియా సంక్షోభం, ఆన్‌లైన్ అప్లికేషన్‌ల లోపాలు, పంపిణీ వ్యవస్థ వైఫల్యాలు వెరసి రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రభుత్వాలు "యాప్ ద్వారా యూరియా బుకింగ్, ఆన్‌లైన్ టోకెన్" వంటి విధానాలు ప్రవేశపెట్టినా, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ అందుబాటు లేకపోవడం, సర్వర్ డౌన్ సమస్యల వల్ల ఆప్ యథార్థంలో రైతుకు సహాయపడకుండా కొత్త ఇబ్బందులు సృష్టిస్తోంది. రైతులకు అవగాహనా కల్పించాల్సిన జిల్లా అధికారులు రైతులకు ఎలాంటి సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం తో రైతులు అప్ ద్వారా ఎలా బుకింగ్ చేసుకోవాలో తెలియక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో ఆప్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో కో ఆపరేటివ్ సెంటర్ వద్ద ఉదయం నుండే యూరియా కోసం పడిగాపులు పాడాల్సిన దుస్థితి రైతులకు దాపురుంచింది. రభి సీజన్ కు కావాల్సిన యూరియా జిల్లాకు అందుబాటులో ఉంచాల్సిన అధికారులు ముందు చూపు లేకపోవడంతో యూరియా అందుబాటులో లేకుండా రైతులకు ఇబ్బందులు పడుతున్నారు. వరి, పత్తి, కంది పంటలకు సరైన సమయంలో యూరియా అందించకపోతే పంట దిగుబడి పై ప్రభావం చూపే అవకాశం వున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక యూరియా వినియోగంతో నేల సారం తగ్గి పంట పై ప్రభావం చూపే అవకాశం వున్నదని, రాబోయే కాలంలో ప్రభుత్వాలు దీర్ఘకాలంగా, యూరియా మీద అధికంగా ఆధారపడే విధానాన్ని తగ్గించి, సంతులిత ఎరువుల వినియోగం, నేల ఆరోగ్య కార్డులు, రైతు అవగాహన కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతు సంఘాల నాయకులు తెలిపారు.
ఆరు ఎకరాల వరి పంట వేయడం జరిగిందని, రోజు యూరియా కోసం కార్యాలయ చుట్టూ తిరుగుతున్నామని, కొత్తగా అప్ లో నమోదు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. మాతో పెద్ద ఫోన్ లేదు, ఎలా అప్ లో నమోదు చేసుకోవాలో మాకు తెలవదని ఆమె తెలిపారు.
జిల్లాకు రబీ సీజన్ కు కావలసిన యూరియా అందుబాటులో ఉందని, సీజన్ మొత్తం 15 లక్షల మెట్రిక్ టన్నులకు గాను ప్రస్తుతం ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని మరో 10 లక్షల మెట్రిక్ టన్నులు ఫిబ్రవరి వరకు అందుబాటులో ఉంటుందని, రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు యాప్ ఉపయోగించడంలో రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు.