జడ్చర్ల : జడ్చర్లలో ఏసీబీ అధికారుల సోదాలు కలకలం రేపాయి. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం లో విద్యుత్ శాఖ కార్యాలయ టీఎస్ ఎస్పీడీసీఎల్ ఇన్చార్జి వెంకటేష్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం రైతు నుండి 15,000 లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. ఈ క్రమంలోనే ఏఈ జడ్చర్ల పట్టణంలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడని తెలుసుకున్న ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు. ఇంకేమైనా అక్రమ ఆస్తులు ఉన్నాయా అనే కోణంలో సోదాలు చేపట్టినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కాగా ఏసీబీ అధికారులు సోదాలకు వచ్చిన సమయంలో ఏఈ ఇంటికి తాళం వేసి ఉండడంతో చాలా సేపు వేచి ఉన్నా ఇంటికి ఎవరూ రాకపోవడంతో చివరికి ఇంటి గడియ ఇరగ్గొట్టి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ ఘటనతో ఆ కాలనీలో కలకలం రేగింది.
Tags
Mahabunagar