తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలున్నాయి. ఇటీవల జరిగిన పదోన్నతుల ప్రక్రియ వల్ల సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీలు) ఉన్నత స్థానాలకు వెళ్లారు. దీంతో ప్రాథమిక విద్య బోధనలో అంతరాయం ఏర్పడుతున్నది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ(Telangana Education Department) కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం టీచర్ల సర్దుబాటుపై కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో అవసరమైన చోట వెంటనే మిగులు టీచర్లతో సర్దుబాటు చేయాలని అధికారులకు పాఠశాల విద్యాశాఖ సూచనలు చేసింది. ఉపాధ్యాయులు పదవీ విరమణ చేసినప్పడు, దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినప్పుడు అసవరం ఉన్నచోట మిగులు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై పంపించాలని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది.
Tags
Telagana