అర్థరాత్రి 42 మంది సజీవదహనం.. అంతా హైదరాబాద్ వారే..!
సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు మరణించినట్లు సమాచారం.. మక్కా నుంచి మదీనాకు భారతీయ ప్రయాణికులతో వెళ్తున్న ప్యాసింజర్ బస్సు.. డీజిల్ ట్యాంకర్ ఢీ కొన్నాయి.. దీంతో భారీగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది.. అందులో ఉన్న 42 మంది ప్రయాణికులు సజీవదహనమైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మృతుల్లో చాలా మంది భారతీయులు ఉన్నారని.. వారిలో హైదరాబాద్ కు చెందిన వారే అధికంగా ఉన్నట్లు గుర్తించారు. 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాదం బదర్ – మదీనా మధ్య ముఫ్రిహాత్ ప్రాంతంలో జరిగింది. అర్థరాత్రి 1.30 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని.. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
హజ్ యాత్రలో భాగంగా మక్కాలో తమ ఆచారాలను ముగించుకున్న యాత్రికులు మదీనాకు వెళుతుండగా.. బస్సు, డిజీల్ ట్యాంకర్ ఢీకొన్నాయి.. ఈ ఘటన జరిగినప్పుడు చాలా మంది ప్రయాణికులు నిద్రలో ఉన్నారని సమాచారం. స్థానిక వర్గాలు 42 మంది మరణించినట్లు నివేదించినప్పటికీ, అధికారులు దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది.
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భారతీయ యాత్రికులతో ఉన్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో 42 మంది సజీవ దహనమైనట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువమంది హైదరాబాదీ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.
Tags
india