Rashmika: విజయ్‌ని పెళ్లి చేసుకుంటా.. ఎట్టకేలకు స్పష్టతనిచ్చిన రష్మిక

 


 తన కోసం యుద్ధం చేసే జీవిత భాగస్వామి కావాలని నటి రష్మిక తాజాగా ఓ చిట్‌చాట్‌లో తెలిపారు. వరుస సినిమాలు, విజయ్‌ దేవరకొండతో నిశ్చితార్థం వార్తలతో గతకొన్ని రోజులుగా నిత్యం రష్మిక ట్రెండింగ్‌లో ఉంటోన్న విషయం తెలిసిందే. తాజాగా ఒక యూట్యూబ్‌ ఛానల్‌ చిట్‌చాట్‌లో ఆమె (Rashmika Mandanna) పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం చెప్పారు.

తన భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నారో చెప్పాలని ఒక అభిమాని కోరగా రష్మిక నవ్వుతూ దానికి సమాధానమిచ్చారు. ప్రపంచం మొత్తం తనకు (Rashmika) వ్యతిరేకంగా ఉన్నా కూడా తన కోసం నిలబడే జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నట్లు వివరించారు. ‘‘నిజాయితీగా చెప్పాలంటే నన్ను లోతుగా అర్థం చేసుకునే వ్యక్తి. ప్రతి విషయాన్ని నావైపు నుంచి ఆలోచిస్తూ అర్థం చేసుకోవాలి. అన్ని పరిస్థితులను ఎదుర్కొనే వ్యక్తి.. ఎలాంటి దాన్నైనా అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని నేను కోరుకుంటున్నాను. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, నాకోసం యుద్ధం చేయగల వ్యక్తి కావాలి. అలాంటి భాగస్వామి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. యుద్ధంలో తూటాకైనా ఎదురెళ్తా’’ అని రష్మిక తెలిపారు. 

ఒకవేళ మీరు డేట్‌ చేస్తే ఎవరితో చేస్తారు? పెళ్లి చేసుకుంటే ఎవరిని చేసుకుంటారు? అని మరో అభిమాని అడగ్గా.. ‘‘డేట్‌ చేస్తే యానిమేషన్‌ క్యారెక్టర్‌ నరుటోతో చేస్తా. ఎందుకంటే నాకు నరుటో పాత్ర చాలా ఇష్టం. పెళ్లి చేసుకుంటే విజయ్‌ని చేసుకుంటా’’ అని చెప్పారు. ఈ సమాధానంతో ఆడియన్స్ అందరూ పెద్దగా అరుస్తూ కంగ్రాట్స్ చెప్పారు. రష్మిక థాంక్స్ చెప్పారు.

అక్టోబర్‌ 3న రష్మిక, విజయ్‌ల నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ ఈ మధ్య పలు ఇంటర్వ్యూల్లో రష్మిక పరోక్షంగా స్పందించారు. ‘నా ఎంగేజ్‌మెంట్‌ విషయంలో మీరు ఏం అనుకుంటున్నారో అదే నిజం. సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తా’ అని అన్నారు. ఇప్పుడు విజయ్‌తో పెళ్లి విషయంలో స్పష్టమైన సమాధానమిచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరగనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow