"నేను 100 బైక్ లు దొంగతనం చేశా.. నాపై కేసులు కూడా ఉన్నాయి. దమ్ముంటే పట్టుకోండి. ఏం చేస్తారో చేయండి" అని ఓ దొంగ తాగిన మత్తులో పోలీసులకు ఛాలెంజ్ చేశాడు. సీరియస్ గా తీసుకున్న ఏలూరు జిల్లా పోలీసులు ఆ దొంగ సవాల్ కు రియల్ రియాక్షన్ రుచి చూపించారు. అతనితో కలిసి దొంగతనాలకు పాల్పడిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. నూజివీడు టౌన్ ఇన్ స్పెక్టర్ సత్యశ్రీనివాస్ ఆధ్వర్యంలో స్పెషల్ పోలీస్ టీమ్ ఈ అంతర్రాష్ట్ర మోటార్ సైకిల్ దొంగల ముఠాను అరెస్ట్ చేసింది. వారి నుంచి రూ.9.08 లక్షల విలువైన 12 బైక్స్ స్వాధనం చేసుకున్నారు.
నిందితులు ఏలూరు, తిరువూరు, అగిరిపల్లి, నూజివీడు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైంది. ఈ ఏడాది జూన్ నుంచి రాత్రి సమయాల్లో బైక్ ల తాళాలను పగులగొట్టి దొంగతనాలు చేసినట్లు పోలీసులు తేల్చారు. అలాగే అక్టోబర్ 28వ తేదీ రాత్రి గంపన్నగూడెం గ్రామం వద్ద మనీషా వైన్స్ షాపులో గుమస్తాగా పనిచేస్తున్న ఆంజనేయ ప్రసాద్ అనే వ్యక్తి నుంచి రూ.40,000 దొంగిలించగా.. రూ.10,000ను రికవరీ చేశారు. పోలీసులకు చాలెంజ్ చేసిన వ్యక్తిని బంగారు సుబ్రహ్మణ్యం (21)గా గుర్తించారు.
నేను వంద బైక్‌లు దొంగతనం చేశా’ సవాల్‌కి రియల్ రియాక్షన్ — ఏలూరు పోలీసుల అరెస్ట్. CLICK FOR OPEN LINK
నూజివీడు టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ P. సత్య శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందం అంతర రాష్ట్ర మోటార్ సైకిల్ దొంగల ముఠా ఐదుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 12 బైక్‌లు @APPOLICE100
Tags
india