Delhi Blast: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు


 Delhi Car Blast: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట సమీపంలో ఒక కారులో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఈ పేలుడు ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద సంభవించింది. కారు పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ పేలుడులో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ భారీ పేలుడు కారణంగా కారులో మంటలు చెలరేగాయి, అలాగే మరో మూడు వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ పేలుడు ధాటికి సమీపంలో పార్క్ చేసిన వాహనాల అద్దాలు పగిలిపోయాయి. వాస్తవానికి పేలుడు జరిగిన సమయంలో అక్కడ పెద్ద సంఖ్యలో జనం ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఢిల్లీలో భారీ పేలుడుతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకుంది. ఎర్రకోట దగ్గర కారులో పేలుడు సంభంవించింది. మెట్రోస్టేషన్‌ దగ్గర కారు నుంచి బ్లాస్ట్ జరగడంతో.. జన భయబ్రాంతులకు గురై పరుగులు తశారు. పలువురికి గాయాలు అవ్వగా, ఐదు కార్లు ధ్వంసం అయ్యాయి.  పేలుడుపై వెంటనే అలెర్ట్ అయ్యారు.  సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది చేరుకుని.. మంటలు ఆర్పారు. ఢిల్లీ శివార్లలో ఇవాళే ఉగ్ర కుట్ర భగ్నం చేశారు పోలీసులు. ఏడుగురు ఉగ్రవాదులను అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో ఈ బ్లాస్ట్ జరగడం సంచలనంగా మారింది.



Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow