దేవరకద్ర: తమతో కలిసి చదువుకున్న బాల్య మిత్రుడు కష్టాల్లో ఉన్నాడని తెలిసి అండగా నిలిచారు పూర్వ విద్యార్థులు. కౌకుంట్ల మండలం, పేరూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 1993-94 బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు తమ తోటి వికలాంగ స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని గుర్తించి ఆర్థిక సహాయం అందించారు. పేరూరు గ్రామానికి చెందిన కే.రాజు గౌడ్ చిన్నప్పటి నుండి వికలాంగుడు అయినప్పటికీ ఆత్మస్థైర్యంతో స్నేహితుల తో చదువుకునే రోజుల్లో నుండి ఆటపాటల్లో అన్నిట్లో పోటీపడేవాడు. కాలక్రమేనా చదువు పూర్తయిన తర్వాత పూర్వ విద్యార్థులందరూ వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తూ దూరమయ్యారు. ఈ మధ్యకాలంలో జరుపుకున్న గెట్ టు గెదర్ కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుసుకొని ఒకరికొకరు సాధకబాధ కాలు చెప్పుకుంటూ కష్టాల్లో ఉన్న తోట స్నేహితులకు సహాయం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే రాజు గౌడ్ కు కొంత ఆర్థిక సాహాయం చేశారు.అంతేకాకుండా అదే గ్రామానికి చెందిన బాలస్వామి అనే మరో స్నేహితుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిసి తన ఇంటికి వెళ్లి పరామర్శించి మేమున్నామని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మిత్రులు ప్రతాప్ రెడ్డి, వెంకటేష్, మోహన్ రావు, కృష్ణ సాగర్, శంకర్, శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్, సతీష్ సాగర్ఉన్నారు.
Tags
mahabubnagar