బాధిత కుటుంబానికి ఎల్ఓసీ అంద‌జేత


 మక్తల్ : మక్తల్ ప్రాంతానికి చెందిన చెందిన దీర్ఘకాలిక వ్యాధితో బాదపడుతున్న సత్తమ్మకు శస్త్ర చికిత్స కోసం ఆదివారం పశుసంవర్ధక, పాడిపరిశ్రమా భివృద్ధి, మత్స్య,క్రీడా యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి రూ.3ల‌క్ష‌ల ఎల్ఓసి ని అందజేశారు. ఆర్థికంగా వెనుక బడిన ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా వైద్య సదుపాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం సహాయ నిధిని ఏర్పాటు చేసిందని తెలిపారు. రాష్ట్రంలోని నిరుపేద ప్రజలకి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని.. ప్రజలందరూ ఆనందముగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుందని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow