జడ్చర్ల యువతలో పెరుగుతున్న గంజాయి వినియోగం

 



  మహబూబ్‌నగర్‌: గంజాయి వినియోగం ఒకప్పుడు పెద్ద పట్టణాలకే పరిమితం కాగా..ఇప్పుడు పల్లెల్లోనూ ఎక్కువ మంది తీసుకుంటున్నారు. 5 గ్రాముల గంజాయి ప్యాకెట్‌ రూ.400 నుంచి రూ.600లకు అమ్ముతున్నారు. వాట్సప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో గ్రూపులను ఏర్పాటు చేసుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు ఎక్కువగా హైదరాబాద్‌ నుంచే సరకు వస్తుండగా...ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి కూడా కొందరు తెప్పిస్తున్నారు.
మారుతున్న ప్రవర్తన: గంజాయిను తీసుకుంటున్న వారి ప్రవర్తన మారుతోంది. గతనెల 27న నారాయణపేట జిల్లా కొత్తకోట మండలం గోకుల్‌నగర్‌లో గంజాయి తాగిని యువకుడు (23) తల్లి పింఛను డబ్బులు ఇవ్వలేదని పారతో నరికేశాడు. 
వెల్దండ మండలం పెద్దాపూర్‌ వద్ద ఆర్టీసీ డ్రైవర్‌ను గంజాయి మత్తులో ఇద్దరు యువకులు కత్తితో దాడి చేశారు.
జడ్చర్ల పైవంతెన వద్ద ఇటీవల ఇద్దరు యువకులు ఘర్షణ పడగా.. విషయం తెలుసుకుని అక్కడికెళ్లిన పోలీసులపైనా దురుసుగా ప్రవర్తించారు.
గద్వాల జిల్లా కేంద్రంలో ఓ గ్యాంగ్‌ గంజాయి మత్తులో హల్‌చల్‌ చేయడంతో పోలీసులు 13 మందిని అరెస్టు చేశారు. మరో 25 మందిని బైండోవర్‌ చేశారు.
ఎక్కడెక్కడ ఉందంటే...

గత నెలలో గట్టు మండలం బోయలగూడెంలో మిరప చేనులో గంజాయి సాగును గుర్తించారు. గతేడాది నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలంలో ఏకంగా 89 గంజాయి మొక్కలను గుర్తించి ధ్వంసం చేశారు. జిల్లాలో గంజాయిని అరికట్టేందుకు కృషి చేస్తున్నామని వనపర్తి ఎస్పీ గిరిధర్‌ తెలిపారు. డీ-అడిక్షన్‌ కేంద్రాల్లోనూ, ఠాణాల్లోనూ మంత్రణం చేస్తున్నామని, అందరికీ అవగాహన కల్పిస్తున్నామన్నారు. పిల్లలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేకదృష్టి పెట్టాలని మానసిక వైద్య నిపుణుడు అనిల్‌రాజ్‌ తెలిపారు. వారి ప్రవర్తనలో అనుమానం వస్తే వైద్యులను సంప్రదించాలన్నారు. 
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow