హన్వాడ : ఆకలితో ఏ ఒక్క విద్యార్థి చదువు ఆగకుండా అక్షయపాత్ర ఫౌండేషన్ చేస్తున్న సేవ అభినందనీయం అని, పిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరం అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గం హన్వాడ మండలంలోని వేపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్షయపాత్ర ఫౌండేషన్ మధ్యాహ్న భోజనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అక్షయపాత్ర ఫౌండేషన్ భారతదేశంలో సేవలందిస్తున్న ప్రముఖ లాభాపేక్షలేని సంస్థ ఇది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఆకలి వల్ల చదువుకు దూరం కాకుండా పౌష్టికాహారం తో కూడిన మధ్యాహ్న భోజనం అందించడం ఈ అక్షయపాత్ర సంస్థ ముఖ్య లక్ష్యం. ఒక మంచి కార్యక్రమానికి మహబూబ్‌నగర్ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. అందుకు నిర్వాహకులకు మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను" అని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు గోనెల శ్రీనివాసులు , డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి మహేందర్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు మైత్రి యాదయ్య, మహిళా అధ్యక్షురాలు నవనీత, కార్యనిర్వాహక అధ్యక్షులు చెన్నయ్య , ఎంఈవో గోపాల్ నాయక్ మరియు అక్షయపాత్ర ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Tags
Mahabunagar