రోడ్డు ప్రమాదం.. కూతురు పెళ్లి ముందు తండ్రికి తీవ్ర గాయాలు


  గోపాల్పేట: వనపర్తి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కూతురు పెళ్లి ఏర్పాట్లతో ఆనందంలో ఉన్న తండ్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే— ఏదుల మండల పరిధిలోని చెన్నారం గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో, కోట్ల శ్యామలమ్మ చేను వద్ద పాలు సరఫరా చేస్తున్న ఆటో, బైక్‌ను ఢీకొట్టింది. గోపాల్పేట మండలం అప్పైపల్లి నుండి చెన్నారం గ్రామానికి పాలు సరఫరా చేసిన ఆటో తిరిగి వెళ్తుండగా, ఎదురుగా వనపర్తి జిల్లా అనంతపురం గ్రామానికి చెందిన బోయ రాములు తన కూతురుతో కలిసి పెళ్లి పత్రికలు పంచేందుకు బైక్‌పై వస్తున్నారు. అదే సమయంలో ఆటో బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన తండ్రి, కూతురిని స్థానికులు వెంటనే వనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయాల తీవ్రతను గమనించిన స్థానికులు “ఈనెల 5న కూతురు పెళ్లి ఉండగా ఇలా జరగడం ఎంతో బాధాకరం” అని ఆవేదన వ్యక్తం చేశారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow