వెబ్‌డెస్క్: తెలంగాణలో ఇటీవల చేవెళ్ల - తాండూరు మధ్య మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ విషాదం నుంచి పూర్తిగా తేరుకోకుండానే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సు ప్రమాదాలు జరిగాయి. తాజాగా బీజాపూర్ - హైదరాబాద్ నేషనల్ హైవేపై మరో రోడ్డుప్రమాదం జరిగింది. మొయినాబాద్ మండల పరిధిలోని తాజ్ సర్కిల్ వద్ద ఓ కారు మర్రిచెట్టును వేగంగా వెళ్లి ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు యువకులుండగా.. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి నలుగురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. కారును పరిశీలించి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుల నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags
Telagan