మీరు ప్రచారానికి రావొద్దు - ఎవరి దగ్గరా నోరెత్తొద్దు' : స్వతంత్రులకు ప్రధాన పార్టీల గాలం! జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక పోటీలో 58 మంది అభ్యర్థులు - నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇదే సరికొత్త రికార్డు - స్వతంత్రులకు ప్రధాన పక్షాల గాలం

 

మీరు ప్రచారానికి రావొద్దు - ఎవరి దగ్గరా నోరెత్తొద్దు' : స్వతంత్రులకు ప్రధాన పార్టీల గాలం!

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక పోటీలో 58 మంది అభ్యర్థులు - నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇదే సరికొత్త రికార్డు - స్వతంత్రులకు ప్రధాన పక్షాల గాలం

Special Story on Jubilee Hills Bypoll Betting : జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని వేడి చేస్తోంది. జూబ్లీహిల్స్‌లో ప్రచారం ఉత్సాహభరితంగా సాగుతోంది. ఈ నెల 11న జరగనున్న ఈ ఉప ఎన్నికపై రాజకీయ పార్టీలు పోటాపోటీగా తలపడుతున్నాయి. ఒకవైపు సీటును నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్‌ కసరత్తు చేస్తుంటే, మరోవైపు అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎలాగైనా గెలవాలనే సంకల్పంతో రంగంలోకి దిగింది. అదే సమయంలో బీజేపీ కూడా ఈ పోటీలో తన ఉనికిని చాటుకునేందుకు ఆసక్తిగా ఉంది. సాధారణ ఉపఎన్నిక కన్నా ఇది రాజకీయ ప్రతిష్ఠ పోరుగా మారింది. అయితే ఈ రాజకీయ రగడ మధ్యలో పందేలు, బెట్టింగ్‌ రాయుళ్ల చర్చ కూడా జోరుగా సాగుతోంది.

కాయ్‌ రాజా కాయ్‌కు జూబ్లీహిల్స్​ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రధాన వనరుగా మారింది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ వేదికలుగా బెట్టింగ్‌ ముఠాలు పెద్ద సంఖ్యలో ఫలితాలపై బెట్టింగ్‌ వేస్తున్నాయని సమాచారం. హైదరాబాద్‌ పరిధిలోని జూబ్లీహిల్స్‌ సీటు రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్ఠాత్మకంగా ఉంటుంది. పట్టణ ఓటర్లు, మధ్య తరగతి, వ్యాపారవేత్తలు, మైనార్టీలతో కూడిన ఈ నియోజకవర్గం ప్రతిసారి వేర్వేరు రాజకీయ సంకేతాలను ఇస్తుంది. ఎన్నిక ప్రచారం ఉత్సాహంగా సాగుతున్నప్పటికీ, రాజకీయ వర్గాల కంటే బెట్టింగ్‌ రాయుళ్లు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. జూబ్లీహిల్స్‌ ఫలితంపై పందేలు వేస్తూ, గెలుపు ఎవరిదో అంచనా వేయడానికి ముందు వరుసలో ఉంటున్నారు. హైదరాబాద్‌లో ఉన్న సర్కిల్‌లు, సోషల్‌ మీడియా గ్రూపుల్లో ఈ విషయం ప్రధాన చర్చగా మారింది.

బెట్టింగ్‌ వేస్తున్నాం - ఎవరు గెలుస్తారు? : తెలంగాణలో మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ ఎన్నికపై ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన కొందరు బెట్టింగ్‌ రాయుళ్లు హైదరాబాద్‌లో ఉన్న తమ పరిచయస్తులను సంప్రదించి, అక్కడ గాలి ఎటు వీస్తోందో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. "బెట్టింగ్‌ వేస్తున్నాం- కచ్చితంగా ఎవరు గెలుస్తారో చెప్పు" అంటూ మీడియా, రాజకీయ వర్గాల మిత్రులను అడుగుతున్నట్టు సమాచారం.

ఒక్కో సర్వే - ఒక్కో విధంగా : సర్వే సంస్థల అంచనాలు కూడా ఈ ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి. ఒక్కో సంస్థ ఒక్కో విధంగా ఫలితాన్ని అంచనా వేస్తుండటంతో గెలుపు ఎవరిదో చెప్పడం కష్టంగా మారింది. బీఆర్ఎస్‌ గెలుస్తుందని కొన్ని సర్వేలు చెబుతుంటే, కాంగ్రెస్‌ పార్టీ తీరా ముందంజలో ఉందని మరికొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. బీజేపీ ఓటు శాతం పెరుగుతోందని మరికొన్ని సర్వేలు సూచిస్తున్నాయి.

ఊపందుకున్న ప్రచారం : ప్రచారం చివరి దశలోకి ప్రవేశించడంతో మూడు పార్టీలూ తమ బలగాలను రంగంలోకి దింపాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్టార్‌ క్యాంపెయినర్లు జూబ్లీహిల్స్‌లో ప్రచారం నిర్వహిస్తున్నారు. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా భారీ ప్రచారం కొనసాగుతోంది. అభ్యర్థుల వ్యక్తిత్వం, స్థానిక అభివృద్ధి వాగ్దానాలు, ప్రభుత్వ పథకాల ప్రభావం అన్నీ కలిసి ఫలితాన్ని నిర్ణయిస్తాయి.

పరిశీలకులు ఏమంటున్నారంటే? : అయితే ఎన్నికల వాతావరణంలో పందేలు అనే కొత్త అంశం ప్రజాస్వామ్య వ్యవస్థకు సవాలుగా మారిందని పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలను లాభనష్టాల లెక్కలుగా చూడటం సరైంది కాదని నిపుణులు అంటున్నారు. ప్రజల ఓటు ఒక నిర్ణయం, ఒక నమ్మకం, ఒక ఆశ అని వారు గుర్తు చేస్తున్నారు.

మానసిక ఆధిక్యం లభించడం ఖాయం : జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఫలితం కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. హైదరాబాద్‌ పట్టణ ఓటర్ల ధోరణి, మధ్య తరగతి ప్రతిస్పందన, మహిళా ఓటు శాతం వంటి అంశాలను ఇది ప్రతిబింబిస్తుందని, ఈ ఎన్నికలో గెలిచిన పార్టీకి మానసిక ఆధిక్యం లభించడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో మరొక ఉత్కంఠభరిత పోటీగా నిలుస్తోందని అంటున్నారు. ఈ నెల 14న ఫలితం ఎవరిని చిరునవ్వులు చిందింపజేస్తుందో చూడాలని చెప్పుకొస్తున్నారు. కానీ ఇప్పటికి మాత్రం ప్రచారం, సర్వేలు, పందేలు మూడు దిశల్లోనూ వేడి కొనసాగుతోందని చెప్పవచ్చని అంటున్నారు.

Independents Campaign in Jubilee Hills : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంది. అలాగే జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్​ నాయకులు, కార్పొరేషన్​ ఛైర్మన్లు రంగంలోకి దిగారు.

ఈ ఎన్నికల్లో గెలుపొందాలని ప్రధాన పార్టీలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. అలాగే రానున్న స్థానిక సంస్థలు, బల్దియా పోరుకు ఈ ఉప ఎన్నిక కీలకం కావడంతో ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అంతేకాదు స్వతంత్ర అభ్యర్థులు సైతం 55 మంది నామినేషన్లు వేశారు. దీంతో ఎన్నికలో పోటాపోటీ నెలకొంది.

55 మంది స్వతంత్ర అభ్యర్థుల పోటీతో కొత్త రికార్డు : జూబ్లీహిల్స్​ ఎన్నికలో భాగంగా స్వతంత్రుల ప్రచారం చూసి, ప్రధాన పార్టీలు ఉలిక్కిపడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నా, బయటి వాళ్లు వచ్చి ప్రచారం చేస్తున్నారంటూ దౌర్జన్యానికి పాల్పడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు స్వతంత్రుల ప్రభావం ఎంత అనే చర్చకు తెరలేపింది. ఉప ఎన్నికలో మొత్తం 58 మంది పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇదే ఓ సరికొత్త రికార్డు.

కొందరు నిరుద్యోగ జేఏసీ తరఫున జూబ్లీహిల్స్​ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. వారి తరఫున ఒక అభ్యర్థితో నామినేషన్​ వేయించిన విషయం తెలిసిందే. వీరి ప్రచారాన్ని ఓ పార్టీ అడ్డుకుంది. దీంతో పరస్పరం కేసులు నమోదు అయ్యాయి. ఓ యువకుడిని దారుణంగా కొట్టారు. దీనిపై నిరుద్యోగులు తీవ్ర నిరసర వ్యక్తం చేసినా పోలీసులు ఇరుపక్షాలపై కేసు నమోదు చేయడం గమన్హారం. ఇటీవల ఇది సోషల్​ మీడియాలో వైరల్​ అయింది.

55 మందిలో కీలకం ఎవర? : రంగంలో ఉన్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు మినహా మిగిలిన 55 మందిలో కొంతమందిలో ప్రధాన పార్టీల వారే నామినేషన్లు వేయించినట్లు తెలిసింది. అలాగే ఏజెంట్ల పాసులు సారూప్య చిహ్నాలతో ఓటర్లను తికమక చేయడం కోసం నామినేషన్లు వేయించినట్లు సమాచారం. మరి కొంత మంది ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు ఈ ఎన్నికను వేదికగా వినియోగించుకుంటున్నారు. వారిలో ఆర్​ఆర్​ఆర్​, నిరుద్యోగ జేఏసీ, ఫార్మాసిటీ నిర్వాసితులు తదితరులు ఉన్నారు. 2023 ఎన్నికల్లో స్వతంత్రులకు వచ్చిన ఓట్లు 5 వేలలోపే ఉన్నాయి.

షరతులు విధిస్తూ ప్రచారం : ప్రభావం చూపే స్వతంత్రుల మద్దతు కోసం ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వారిని పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటనలు చేయాలని లేదా ప్రచారానికి రాకుండా మౌనంగా ఉండాలని వారికి షరతులు విధిస్తున్నాయి. మరోవైపు కొందరు ప్రధాన పార్టీల నుంచి డబ్బు వసూలుకు నామినేషన్లను దాఖలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలో గెలుపు మరెన్నో మలుపులకు మూలం కావొచ్చని భావిస్తున్న ప్రధాన పార్టీలు, సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. విజయాన్ని దక్కించుకునేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ జారవిడుచుకోకూడదని వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. నియోజవర్గంలో 4 లక్షల మంది ఓటర్లున్నా, అందులో 50 శాతం మందే అభ్యర్థుల తలరాతలు మార్చవచ్చని నేతలు విశ్వసిస్తున్నాయి.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow