బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు.. ఐదుగురిపై కేసు న‌మోదు

 గోపాల్ పేట : వ‌న‌ప‌ర్తి జిల్లా ఏదుల మండ‌ల కేంద్రంలోని ఓ బాల్య వివాహాన్ని బాల‌ల ప‌రిర‌క్ష‌ణ విభాగం వ‌న‌ప‌ర్తి అధికారులు గోపాల్ పేట పోలీసులు అడ్డుకున్నారు. గోపాల్ పేట పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. అక్టోబ‌ర్ 31న ఏదుల మండ‌ల కేంద్రంలో బాల్య వివాహ జ‌రుగుతుంద‌ని చైల్డ్ లైన్ కు స‌మాచారం వ‌చ్చింది. బాల‌ల ప‌రిర‌క్ష‌ణ విభాగం వ‌న‌ప‌ర్తి అధికారులు, గోపాల్ పేట పోలీసులు ఏదుల మండ‌ల కేంద్రానికి వెళ్లి బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. అనంత‌రం వారికి కౌన్సెలింగ్ చేశారు. ఈ వివాహం చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన పెల్లి కొడుకు త‌ల్లిదండ్రుల‌పై పెళ్లికూతురు, త‌ల్లిదండ్రుల‌పై మొత్తం ఐదుగురు పై ఫిర్యాదు దారుల‌కు ముద్దం ఈద‌మ్మ బాల‌ల ప‌రిరక్ష‌ణ విభాగం అధికారి ఫిర్యాదు మేర‌కు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశార‌ని ఏఎస్ఐ ర‌మ‌ణి తెలిపారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow