విద్యార్థి కర్ణభేరి పగిలేలా కొట్టిన ఉపాధ్యాయుడు..

 



విద్యార్థి కర్ణభేరి పగిలేలా కొట్టిన ఉపాధ్యాయుడు..



జడ్చర్ల: గురుకుల పాఠశాలకు పంపాలంటేనే ఒకంత ఆందోళన చెందే విధంగా వ్యవహరిస్తూ విద్యార్థి కర్ణభేరి పలిగేలా కొట్టాడు జడ్చర్లలోని స్వామి నారాయణ గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు. విద్యార్థి అల్లరి చేస్తున్నాడని ఆగ్రహించిన ఉపాధ్యాయుడు చెవిపై కొట్టడంతో కర్ణబెరి పూర్తిగా దెబ్బతింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడంతో ఆందోళనకరంగా మారింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల లో స్వామినారాయణ ఇంటర్నేషనల్ గురుకుల పాఠశాలలో హాస్టల్లో ఉంటూ ఎనిమిదవ తరగతి చదువుతున్న హైదరాబాద్ కి చెందిన సిద్ధార్థ అనే విద్యార్థిని అల్లరి చేస్తున్నాడని శుక్రవారం రోజు క్లాస్ టీచర్ నాగరాజు ఎంచెవిపై కొట్టడంతో ఫోన్లో విద్యార్థి తన తల్లిదండ్రులకు తెలపడంతో పాఠశాల వద్దకు వచ్చి విద్యార్థిని ఇంటికి వెళ్లిన అనంతరం విద్యార్థికి బాగా చెవి నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు.
దీంతో విద్యార్థిని గమనించిన వైద్యులు చెవి కర్ణభేరి పూర్తిగా దెబ్బతిందని వినికిడి ని కూడా కోల్పోయాడని తెలపడంతో ఆగ్రహించిన విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. తమ కుమారుడి చెవిపై కొట్టడంతో వినికిడిని పూర్తిగా కోల్పోయాడని పాఠశాల యాజమాన్యమే తమ కుమారుడికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా పాఠశాల ప్రిన్సిపాల్ రమేష్ రెడ్డి విద్యార్థి పై చేయి చేసుకున్నందుకు తనని సస్పెండ్ చేశామని మాట దాట వేశాడు. కానీ అంతలోపే ఉపాధ్యాయుడు నాగరాజును పాఠశాలలోనే ఓ గదిలో దాచి ఉంచడంతో బాధిత విద్యార్థి కుటుంబంకులు దాడికి దిగారు. దీంతో పాఠశాలలో ఒక్కసారిగా ఆందోళనకర వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ నాయకులు పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. మరోవైపు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన విరమింపే ప్రయత్నం చేశారు. కాగా పాఠశాలలో ఉపాధ్యాయుడు నాగరాజు నిత్యం విద్యార్థుల పై చేయి చేసుకుంటాడని నిత్యం తమను భయాందోళనకు గురి చేస్తున్నాడని తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు తమ కొడుకు పై ఉపాధ్యాయుడు నాగరాజు అకారణంగా చేయి చేసుకోవడంతో తమ కొడుకు పూర్తిగా వినికిడిని కోల్పోయాడని పాఠశాల యాజమాన్యమే తమకు న్యాయం చేయాలని విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. *తన తప్పేం లేదు బాధ్యత విద్యార్థి* విద్యార్థి మాట్లాడుతూ తాను నోట్బుక్ మిస్ అయిందని క్లాస్ రూమ్ లోనే వెళ్లి వెతుకుతుండగా అప్పుడే వచ్చిన ఇంగ్లీష్ టీచర్ నాగరాజు తేనకాలపై ఏం చేస్తున్నావని ఎన్ కి పోవాల్సిన అవసరం ఏముందని అడిగి తన సమాధానం చెప్పేలోపే తన చెవులపై ఐదారు సార్లు కొట్టాడని దీంతో తన చావు నొప్పి పట్టిందని ఇదే విషయాన్ని తాను సాయంత్రం తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పానని తాను క్లాస్ రూమ్ లో ఎలాంటి తప్పు చేయలేదని అకారణంగా తనను కొట్టాడని బాధిత విద్యార్థి సిద్ధార్థ ఏడుస్తూ తెలిపాడు. *మరో విద్యార్థి పై కూడా* జగిత్యాల జిల్లాకు చెందిన నిశాంత్ అనే 9వ తరగతి విద్యార్థి గత రెండు నెలల క్రితం స్టడీ అవర్ లో పండుకున్నాడు అనే నేపంతో పాఠశాల అవార్డెన్ విద్యార్థి చెవులపై కొట్టడంతో అతనిది కూడా కర్ణభేరి పగిలిందని దీంతో విద్యార్థుల తండ్రులు అప్పట్లో పాఠశాల వద్దకు వచ్చి ఆందోళన చేస్తుండగా వారిని వారించి వారి విద్యార్థి సంవత్సరపు ఫీజు రిటర్న్ చేస్తామని మాట ఇచ్చారని ఇప్పటికి కూడా ఆ ఫేస్ రిటర్న్ ఇవ్వకపోగా ఆ విద్యార్థి కర్ణభేరి సమస్యతో బాధపడుతున్నట్లు బాధిత విద్యార్థి మీడియా ముందు తెలిపాడు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow