Mahabubnagar News :PRO శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన మహబూబ్‌నగర్ జిల్లా PRO ఎస్.శ్రీనివాసులకు రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా ప్రశంసా పత్రం తీసుకోవడం జరిగింది"
ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి IPS ప్రధాన అతిథిగా ముగింపు సందర్భంగా శిక్షణ పూర్తి చేసిన అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా ప్రజా సంబంధాల అధికారి ఎస్. శ్రీనివాసులు శిక్షణలో సఫలంగా పాల్గొని, రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి IPS చేతుల మీదుగా ప్రశంసాపత్రం స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి. జానకి IPS
శ్రీనివాసులు గారిని అభినందిస్తూ, "ప్రజా సంబంధాల విభాగం పోలీస్ వ్యవస్థకు ముఖచిత్రం వంటిది. శిక్షణ ద్వారా నేర్చుకున్న అంశాలను జిల్లాలోని పోలీస్ ప్రజా సంబంధాల పనిలో ఉపయోగించి మరింత చురుకుగా పనిచేయాలని" సూచించారు.

ఈ కార్యక్రమంలో IGP (P&L) రమేష్ రెడ్డి IPS, DCP (CAR) రక్షిత మూర్తి IPS , శిక్షణా సమన్వయకర్తమధుసూదన్ , మరియు తెలంగాణ సురక్ష బృందం సభ్యులు పాల్గొన్నారు.
Tags
mahabubnagar