అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. కంటైనర్ లారీ బోల్తా

 

,ఉండవెల్లి: ఢిల్లీ నుంచి బెంగళూరు కి వెళుతున్న KA51 AK8520 కంటైనర్ లారీ బోల్తా పడటంతో డ్రైవర్, క్లీనర్ కు తీవ్ర గాయాలైన ఘటన మధ్య రాత్రి చోటుచేసుకుంది. 108 పైలట్ సిబ్బంది శ్రీశైలం, ఈఎంటీ శివశంకర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళుతున్న కంటైనర్ లారీ 44వ జాతీయ రహదారి ఉండవెల్లి స్టేజి దగ్గర రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవర్ శివకుమార్ సింగ్, క్లీనర్ల దేవేందర్ సింగ్ కు గాయాలైనాయి. స్థానిక వాహనదారులు గమనించి 108 అంబులెన్స్ సమాచారం ఇవ్వడంతో గాయపడిన ఇద్దరిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు 108 సిబ్బంది పేర్కొన్నారు. డ్రైవర్ నిద్ర మత్తు వర్షం కారణంగానే కంటైనర్ లారీ బోల్తా పడి ఉండవచ్చు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow