గంజాయి సేవిస్తున్న 5 మంది వ్య‌క్తులు అరెస్ట్


తెల్కపల్లి  : గంజాయి సేవిస్తుండగా 5 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు తెలిపారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో వివ‌రాలు వెల్ల‌డించారు. తెలకపల్లి శివారులో గంజాయి సేవిస్తున్నట్లు స‌మాచారం వ‌చ్చింది. గుంపల గణేష్ (19) నాగర్ కర్నూల్ టౌన్, ముప్పారపు అఖిల్ (19), జూవేనాలి బాయ్, రసాల నరేష్ (22), గుగ్గిళ్ల చరణ్ (23) అనే వ్యక్తులు తెలకపల్లి శివారులోని ఓ వెంచర్ లో చెట్టు కింద గంజాయి సేగిస్తుండగా తెలకపల్లి ఎస్ఐ వారి సిబ్బందితో వెళ్లి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వారిని విచారించగా నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన వ్యక్తులతో కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నారు. 138 గ్రాముల గంజాయి, 03 సెల్ ఫోన్లు, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. యువకులు గంజాయి సేవిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ స‌మావేశంలో నాగర్ కర్నూల్ సీఐ అశోక్ రెడ్డి, తెలకపల్లి ఎస్సై నరేష్ పాల్గొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow