NEPAL TO JADCHERLA VIA BIHAR టీ షాప్ లే.. గంజాయి అడ్డలు #mahabubnagar #news



Flash news Jadcherla :-అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించడంతో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి నుండి పదివేల విలువగల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించారు.

మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం సమీపంలో ఓ టీ స్టాల్ వద్ద గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో నిన్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పదంగా ఉన్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. కాగా వారి నుండి పదివేల రూపాయల విలువైన 250 గ్రాముల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్ కు తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా జడ్చర్ల పట్టణ సిఐ కమలాకర్ మాట్లాడుతూ ఇటీవల బీహార్ రాష్ట్రం నుండి గంజాయిని దిగుమతి చేసుకొని షాద్నగర్ మరియు బాలానగర్ పరిసర ప్రాంతాలలో పరిశ్రమలు కలిగి ఉండడంతో అక్కడ పనిచేసే కార్మికులకు గంజాయిని విక్రయిస్తూ ఉంటారని ఈ నేపథ్యంలోనే మాచారంలో కూడా ఓ టి పాయింట్ హోటల్ వద్ద గంజాయిని విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఆర్ ఎన్ సి సి యూనిట్, ఈగల్ టీం, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నిందితులను పట్టుకోవడం జరిగిందని అనంతరం వారిని డిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు. ఎక్కడైనా ఎవరైనా అక్రమంగా గంజాయిని విక్రయించినా పోలీసులకు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుందని గంజాయి అరికట్టేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం సీఐ తెలిపారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow