జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. బావతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఓ వివాహితను అత్తమామలు వేధించారు. అందుకు ఆమె నిరాకరించడంతో గత 10 రోజులుగా గదిలో బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, మానవ హక్కుల సంఘాల నేతలు ఆమెను రక్షించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags
india