మరణించిన మరోమారు ప్రపంచాన్ని చూసే అద్భుత అవకాశం..నేత్రదానం చేసిన డాక్టర్ సోమశేఖర్



 మీరు చేసే నేత్రదానం

ఇద్దరి జీవితాలను వికసింపచేస్తుంది


నేత్రదానం చేసేందుకు ముందుకు రండి...

ఇద్దరికి చూపును ప్రసాదించి ఆదర్శంగా నిలిచిన డా॥ KS సోమశేఖర్...


మరణించిన మరోమారు ప్రపంచాన్ని చూసే అద్భుత అవకాశం నేత్రదానం చేయడం వల్లే లభిస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న మహబూబ్‌నగర్, కలెక్టర్ బంగ్లా వెనక, మోనప్పగుట్ట వాసి డా॥ KS సోమశేఖర్ (86) వయోభారంతో మరణించారు. తన మరణానంతరం నేత్రాలు దానం చేయాలని అతని కోరిక మేరకు వారి కుమారుడు, కోడలు డా॥ KSEN ప్రేమ్ కుమార్ - వాణి మరియు కుమార్తెలు ఉమామహేశ్వరి, ఉమాజగదీశ్వరి  రెడ్ క్రాస్ కు సమాచారం అందించారు.


ఈ మేరకు చైర్మన్  అంబటి నటరాజ్  మరియు LV ప్రసాద్ కంటి ఆసుపత్రి టెక్నీషియన్ శివ సత్వరమే స్పందించి 'కార్నియా' ను సేకరించి, కుటుంబ సభ్యులకు ధృవీకరణ పత్రం అందించారు. ఈ సందర్భంగా Ln అంబటి నటరాజ్  మాట్లాడుతూ ఇప్పటి వరకు 227 మంది తమ 'కార్నియా' ను దానంచేసి 454 మందికి చూపు కల్పించారని తెలిపారు.

అలాగే డా॥ KS సోమశేఖర్ కుటుంబ సభ్యులకు Ln అంబటి నటరాజ్ , లయన్స్ క్లబ్ ఆఫ్ పాలమూరు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ మహబూబ్‌నగర్ తరఫున ధన్యవాదాలు తెలిపారు.

నేత్రదానం చేయాలనుకునే వారు రెడ్ క్రాస్ చైర్మన్, Ln నటరాజ్ గారిని #9666900900 సంప్రదించగలరు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow