అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం పలు గ్రామాలకు ఫోన్ సిగ్నల్ లేకపోవడంతో అధికారులు, అనధికారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకం చేస్తున్న కూలీలను ఈకేవైసీ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయి. దీంతో మద్దిమడుగు గ్రామపంచాయతీలో ఫోన్ సిగ్నల్ లేకపోవడంతో కూలీలు దాదాపు పది కిలోమీటర్ల దూరం నడిచి వచ్చి ఓ చెట్టు కింద సిగ్నల్ వచ్చిన ప్రదేశానికి చేరుకున్నారు. అధికారులు ఆ చెట్టు వద్దకు వచ్చి కూలీలకు ఈకేవైసీ పూర్తి చేస్తున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటయ్య, పంచాయతీ కార్యదర్శి అశోక్, ఉపాధి హామీ సిబ్బంది ఉన్నారు.
Tags
Nagar Kurnool