అమృత్ 2.0 కింద జడ్చర్ల మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ : కలెక్టర్ విజయేందిర బోయి


 

జడ్చర్ల : అమృత్ 2.0 పథకం కింద జీఎస్ఐ ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పన సమర్థవంతంగా చేపట్టాలని ఇందు కోసం అవసరమైన వివరాలను సంబంధిత శాఖల అధికారులు అందించాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో డీటీసీపీ సంయుక్త సంచాలకులు, అమృత్ 2.0 నోడల్ అధికారి అశ్విని, సంబంధిత శాఖల అధికారులకు,మున్సిపల్ కౌన్సిలర్ లకు,వివిధ శాఖల అధికారులకు జడ్చర్ల మాస్టర్ ప్లాన్ రూపకల్పన అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొదటి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీఐఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పన సమర్దవంతంగా చేపట్టాలని.. మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు అవసరమైన సమాచారం వివిధ శాఖలు నవంబర్ 7 లోగా అందించాలన్నారు. పట్టణ ప్రస్తుత స్థితిని అర్థం చేసుకోవడానికి, 20 సంవత్సరాల వరకు భవిష్యత్తు అవసరాలు అంచనా వేయడానికి ప్రాదేశిక వివరాలను సేకరించాలని తెలిపారు. డిజిటల్ మ్యాపింగ్ లో డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి భూ వినియోగ మ్యాప్లు రూపొందించవచ్చని, నూతన డేటాను ఎస్ ఆధారిత ప్లాన్లను నవీకరించవచ్చని, తద్వారా అభివృద్ధి ప్రతిబింబించేలా అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. సమగ్ర ప్రణాళిక ద్వారా భవిష్యత్ అభివృద్ధికి భూ వినియోగం, భవన నిర్మాణం, రవాణా, వివిధ రంగాల అభివృద్ధికి తోడ్పడతాయని తెలిపారు. 2051 సంవత్సరం నాటికి జనాభా మరింత పెరిగే అవకాశం ఉందని, జనాభా ప్రాతిపదికన ప్రజలకు అవసరమైన ఇండ్లు, త్రాగునీరు, రహదారులు, ఇతర సదుపాయాలు ప్రణాళికాబద్ధంగా అందించాల‌న్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow