నవాబుపేట : వాహన చోదకుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మండల పరిధిలోని కాకర్ల పహాడ్ గ్రామానికి చెందిన ముర్గని రాంచంద్రయ్య (50) తన వ్యవసాయ పొలం వద్దకు రోడ్డు ప్రక్కనుండి నడుచుకుంటూ వెళ్తుండగా మండల పరిధిలోని తీగలపల్లి గ్రామానికి చెందిన చాకలి శివ తన బైక్ పై రాంగ్ రూట్ లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ వచ్చి ఆయనను ఢీకొట్టాడు. దాంతో రామచంద్రయ్య తీవ్రంగా గాయపడగా ఆయనను మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయించారు. గాయల తీవ్రత అధికంగా ఉండడంతో ఆయన మృతి చెందారు. మృతుడి భార్య మాసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు.
Tags
mahabubnagar