జడ్చర్ల/ మిడ్జిల్ : జడ్చర్ల నుండి కల్వకుర్తి వైపు బైకు పై
వెళ్తున్న యువకుడు ప్రమాదవశాత్తు ఎమ్మెల్యే కారు ను ఢీకొట్టడంతో స్వల్పంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వాడ్యాల గేటు సమావేశంలో మాజీ ఎంపిటిసి సభ్యుడు నరసింహ కుటుంబ సభ్యులు శుభకార్యంలో పాల్గొనడానికి వచ్చారు. ఎమ్మెల్యే కారు దిగి ఫంక్షన్ హాల్ వైపు వెళ్లారు. అదే సమయంలో ఎమ్మెల్యే డ్రైవర్ కారును రోడ్ సైడ్ తీస్తుండగా జడ్చర్ల నుండి కల్వకుర్తి బైక్ పై వెళ్తున్న గణేష్ కారును ఢీకొట్టడంతో స్వల్పంగా గాయపడ్డాడు. గాయపడ్డ గణేష్ తలకొండపల్లి మండలం గట్టిపల్లి గ్రామానికి చెందిన యువకుడు. వెంటనే స్పందించిన స్థానిక కాంగ్రెస్ నాయకులు మిడ్జిల్ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు. గాయపడ్డ గణేష్ ను ఎమ్మెల్యే హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు. స్వల్పంగా గాయపడడంతో నాయకులు ఊపిరి పీల్చుకున్నారు.
