హైదరాబాద్: టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. సిటీ బస్సుల్లో ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో అదనపు ఛార్జీలు పెంచుతున్నట్లు పేర్కొంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎస్ప్రెస్, ఈ-ఆర్డినరీ, ఈ-ఎస్ప్రెస్బ, మెట్రో డీలక్స్, ఈ-మెట్రో, ఏసీ సర్వీసులో చార్జీల పెంచుతున్నట్లు చెప్పింది. మొదటి మూడు స్టేజిలకు రూ.5, 4వ స్టేజి నుంచి రూ.10 అదనపు ఛార్జీల వసూలు చేయనున్నట్లు సమాచారం. మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీలు వసూలు చేయనుంది. అయితే.. పెరిగిన ఛార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్‌లో బస్సు ఛార్జీల పెంపుపై టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సులకు ఛార్జీలు పెంచాలని నిర్ణయించింది. ఎలక్ట్రిక్ బస్సుల మౌలిక సదుపాయాల వ్యయం సమకూర్చడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ పేర్కొంది. ఆర్టీసీ తాజా ప్రకటన ప్రకారం.. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని రకాల బస్సుల్లో మొదటి మూడు స్టేజీల వరకు రూ.5 పెంచనున్నారు. నాలుగో స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీ వసూలు చేయనున్నారు.
Tags
Telangana