బాదేపల్లి పూర్వ విద్యార్థుల సమావేశానికి అధికంగా తరలి రండి
నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి
కనిపెంచిన తల్లిదండ్రులు, స్వంత ఊరు, చదువుకున్న పాఠశాల రుణం ఎప్పటికి తీర్చుకోలేనిదని నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. జడ్చర్ల నియోజకవర్గకేంద్రంలోని బాదేపల్లి జెడ్పిహైస్కూల్ శతాబ్ది సంబురాల నిర్వహణలో భాగంగా ఈనెల 11న నిర్వహిస్తున్న పూర్వ విద్యార్థుల సన్నాహక సమావేశానికి ఆయనను ఉత్సవ కమిటి సభ్యులు కలుసుకుని సాదరంగా అహ్వనించారు. ఈ సందర్భంగా మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ బాదేపల్లి జెడ్సిహైస్కూల్లో చదవటం తన అదృష్టమని, తనలాగే అందులో చదువుకున్న ప్రతి ఒక్కరు భాగ్యవంతులేనన్నారు. నవంబర్ నెలలో నిర్వహించే శతాబ్ది సంబురాల సన్నాహక సమావేశం ఈనెల 11 శనివారం చంద్రగార్డెన్లో నిర్వహిస్తున్నందున పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో హజరు కావాలని కోరారు. చదువుకున్న బడి రుణం కొంతైనా తీర్చుకునే అవకాశం వచ్చిందని, ప్రతి ఒక్కరు భాగస్వామ్యు కావాలని పిలుపునిచ్చారు. ఆయనను కలుసుకున్న వారిలో ఉత్సవ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ వి. కృష్ణ, ఎంఈఓ మంజులాదేవి, ప్రదానోపాధ్యాయురాలు చంద్రకళ, ఉత్సవ కమిటి బృందం శ్రీశైలం యాదవ్, ఉమాశంకర్ గౌడ్, మేడిశెట్టి రామకృష్ణ, శ్యాంసుందర్, గోపాల్, ఇబ్రహీం, జయప్రకాష్, సత్యం, శ్రీనివాసాచారి, సంతోష్ వారి ఉపాధ్యాయులు సునీల్, శంకర్, యుగంధర్లు ఉన్నారు.
