Road Accident inTelangana: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం..

 



రోడ్డు ప్రమాదాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో అవగాహన కల్పిస్తున్నాయి. అయినా వాహనదారులు తీవ్ర నిర్లక్షంతో వాహనాలను నడిపి ప్రమాదాలకు గురవుతున్నారు. గమ్యస్థానాలకు చేరుకోవాలనే తొందరలో అతివేగంతో వాహనాలను నడిపి ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకుంటున్నాయి.

తాజాగా మహబూబ్‌నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలం కాటారం స్టేజి సమీపంలో 44 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న బీసీవీఆర్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో నుంచి ఎగిరిపడి ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి, క్షతగ్రాతులను మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow